telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

పంచాయతీ ఎన్నికలు పై ఏపీ హైకోర్టు తీర్పు… కానీ..?

ap high court

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించొద్దని దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ పూర్తి చేసింది. కానీ తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్ట్.  ఎన్నికల సంఘం తరపున న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కర్ణాటక, రాజస్తాన్, బీహార్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పులను ఏపీ హైకోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు న్యాయవాది అశ్వనీకుమార్. ఎన్నికల నిర్వహణ గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులకు రాసిన లేఖల వివరాలను కూడా వెల్లడించారు లాయర్ అశ్వనీకుమార్. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తాము నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాము అని అడ్వొకేట్ అశ్వనీకుమార్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహరాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసారు అశ్వనీకుమార్. ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ సమయంలో ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్ట్ ఆదేశించిన తీర్పు అంశాలను ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపాడు. ఎన్నికల కమిషన్, న్యాయవాది చెప్పిన అంశాల్లో కమిషనర్ ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను మాత్రమే అధికారులతో చర్చించారని న్యాయవాది చెప్పారు.

Related posts