telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అమెరికా అధ్యక్షుడు ఎవరో తేల్చిన ఆ జంతువులు…

ప్రస్తుతం ప్రపంచ దేశాలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది అనే వైపే చుస్తునాయి. అయితే తాజాగా రెండు పులులు, ఒక ఎలుగుబంటి ఈ విషయం లో జోస్యం చెప్పాయి. ఎలుగుబంటి ఎవరివైపు? పులులు ఎవరివైపు?2016 ఎన్నికల్లో ఎలుగుబంటి జోస్యం నిజమైందా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై బైడెన్‌ ఘనవిజయం సాధిస్తారని సైబీరియాకు చెందిన ఓ ఎలుగుబంటి జోస్యం చెప్పింది. 2016 ఎన్నికల్లో కూడా ఈ ఎలుగుబంటి చెప్పినదే నిజమై హిల్లరీ క్లింటన్‌పై డొనాల్డ్‌ ట్రంప్‌ గెలుపొందారు. అదే ఎలుగు బంటి ఈసారి ట్రంప్‌ ని కాకుండా బైడెన్‌ను ఎంచుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంపై ప్రపంచవ్యాప్తంగా చాలా మంది రాజకీయ జ్యోతిష్కులు ఎప్పటి నుంచొ తమతమ వాదనలు వినిపిస్తున్నారు. రష్యా వారు సమాధానం తెలుసుకోవడానికి అసాధారణమైన విధానాన్ని ఉపయోగించారు.

అయితే వీరి విధానంలో నిపుణులు రెండు పులులు, ఒక ఎలుగుబంటితో పుచ్చకాయలపై అభ్యర్థుల ఫొటోలను ముద్రించి తీసుకువచ్చి ఉంచి వాటి జోస్యాన్ని గుర్తించారు. తమాషా ఏంటంటే రెండు పులులతోపాటు ఎలుగుబంటి కూడా జో బైడెన్‌దే విజయం అని సంకేతాలిచ్చాయి. సైబీరియాలోని క్రాస్నోయార్స్క్‌లోని రాయెవ్ రోచీ జూలో పార్క్‌లో ఈ ఘటన జరిగింది. బుయాన్ అనే ఎలుగుబంటి తన ఎంపికలో బైడెన్ పుచ్చకాయ ముట్టుకుంది. దీంతో బైడెన్‌ విజయం ఖాయమైనట్లేనని రాయెవ్‌ రోచీ జూ సిబ్బంది చెప్తున్నారు. ఈ జూ ఎపిసోడ్‌ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో బైడెన్‌కు కావాల్సినంత ప్రచారం వచ్చినట్లయింది. అయితే, పలుసార్లు బుయాన్‌ అంచనా వేయడంలో విఫలమైందని నెటిజన్లు అంటున్నారు.

Related posts