telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పాక్ లో .. మహాభారత్ పోస్టర్లు .. భారత్ నిర్ణయంపై పాకిస్థానీయుల హర్షం..

mahabharat posters in pak makes

జమ్ముకశ్మీర్ కు సంబందించిన ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అసలు.. ఆర్టికల్ 370 ని రద్దు చేసిందే పాక్ ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి. 370ని అడ్డం పెట్టుకొని పాక్ ఉగ్రవాదులు కశ్మీర్ పై దాడులకు తెగబడుతున్నారు. పీవోకే దాటి వచ్చి జవాన్లపై పంజా విసురుతున్నారు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటునుంచి నరుక్కుంటూ వెళ్తోంది. నిజానికి ఆర్టికల్ 370 రద్దు అనేది పాకిస్థాన్ కు మింగుడు పడని వార్త. కశ్మీర్ పై వాళ్ల పెత్తనం ఇక చెల్లదు. కశ్మీర్ లో ఇన్నిరోజులు వాళ్లు చేసిన ఆగడాలు ఇక సాగవు. అయితే… ఇప్పటికే కశ్మీర్ తమకు కాకుండా పోతుందని పాకిస్థానీయులు బాధపడుతుంటే… పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో వెలిసిన కొన్ని పోస్టర్లు వాళ్ల పుండుపై కారం చల్లినట్టుగా ఉన్నాయి. ఇస్లామాబాద్ లో మహా భారత్.. ఏ స్టెఫ్ ఫార్వార్డ్(ఒక అడుగు ముందుకు) పేరుతో కొన్ని పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లు ఇండియాకు అనుకూలంగా వెలిసినవి. ఆ పోస్టర్లలో ఏముందంటే… రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్టికల్ 370ని రద్దును ప్రతిపాదించాక… శివసేన ఎంపీ సంజయ్ రావత్ సభలో చేసిన వ్యాఖ్యలు అందులో ఉన్నాయి.

రావత్ చేసిన వ్యాఖ్యలను ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే… ఇవాళ మనం జమ్ముకశ్మీర్ ను తిరిగి పొందాం. రేపు బలుచిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను కూడా చేజిక్కించుకుంటాం. ఈ ప్రభుత్వం అవిభక్త భారతదేశం కలను నెరవేరుస్తుందని నేను నమ్ముతున్నాను.. అంటూ ఆయన పార్లమెంట్ లో వ్యాఖ్యలు చేశారు. ఏఎన్ఐ ఆయన వ్యాఖ్యలతో పాటు.. మాట్లాడుతున్న ఫోటోను కూడా ట్వీట్ చేసింది. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా పోస్టర్లలో ముద్రించి ఇస్లామాబాద్ వీధుల్లో ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్లను గమనించిన కొందరు ఇస్లామాబాద్ వాసులు.. బిత్తరపోయారు. వాటి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పాకిస్థానీయులు ఏం చేస్తున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు. తమ దేశ పరువును తామే తీసుకోవడం ఏంది.. అంటూ ఫైర్ అవుతున్నారు. మన దేశంలో.. మన పట్టణంలో.. హైవేపై ఇండియన్స్ ఈ పోస్టర్లను ఇంత దర్జాగా ఏర్పాటు చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం. మనం నిద్రపోతున్నాం. ఈ దేశ ప్రజలకు ఏం పట్టుకుందో నాకైతే అర్థం కావడం లేదంటూ ఆ పోస్టర్లను చూసిన ఓ పాకిస్థానీ తన ఆవేదనను సోషల్ మీడియాలో వ్యక్తం చేశాడు.

Related posts