telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

మళ్లీ భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు ఢిల్లీలో, హైదరాబాద్ లో మాత్రం బంగారం ధరలు భారీగా తగ్గిపోయాయి. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.430 తగ్గడంతో రూ. 50,730కు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరగడంతో రూ. 46,500కు చేరుకుంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 440 తగ్గడంతో రూ. 48,380 కు చేరుకుంది… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 తగ్గడంతో రూ. 44,350 పలుకుతోంది. అటు వెండి ధర కూడా భారీగానే తగ్గింది. కిలో వెండి ధర రూ. 1000 తగ్గి రూ. 72,200గా నమోదైంది.

Related posts