telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

రాష్ట్రాలు ఒక్కటై కృషి చేయడం ప్రశంసనీయం: ప్రధాని మోదీ

narendra-modi

దేశ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసింది. దేశంలో కోవిడ్‌-19 పరిస్థితిపై ప్రధాని సమావేశంలో చర్చించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాల సీఎంలు స్పందిస్తూ… క్లిష్ట సమయంలో ప్రధాని తన నాయకత్వ ప్రతిభను చూపారన్నారు. ఢిల్లీ మర్కజ్‌ వెళ్లొచ్చిన వారి వివరాలు సేకరించినట్లు ప్రధానికి తెలిపారు.

అనంతరం ప్రధాని మాట్లాడుతూ… కరోనా కట్టడికి రాష్ట్రాలు ఒక్కటై కృషి చేయడం ప్రశంసనీయమని కొనియాడారు. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఈ నెల 14వ తేదీతో లాక్‌డౌన్‌ ముగియనున్న నేపథ్యంలో ప్రజలంతా మూకుమ్మడిగా బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. కావునా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన వ్యూహాలు ఆలోచించుకుని చర్యలు చేపట్టాలన్నారు.

Related posts