దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నగరంలో అద్దె ఇళ్లలో నివసించే వారికి శుభవార్త చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…’ముఖ్యమంత్రి కిరాయిదార్ బిజ్లి మీటర్ యోజన’ పథకం కింద అద్ధె ఇళ్లలో ఉండే వారు 200 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగిస్తే వారికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. ఈ పథకం కింద ప్రీపెయిడ్ మీటర్లను అద్దె గృహలకు బిగిస్తామన్నారు. 200 యూనిట్ల కంటే ఎక్కువ యూనిట్ల విద్యుత్ వాడకం జరిగితే సొంత గృహలు ఉన్న వారు చెల్లించినట్లే రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. ఈ పథకం కేవలం నివాస గృహలలో ఉపయోగించే మీటర్లకు మాత్రమే వర్తింస్తుందన్నారు.
అద్దె ఇళ్లలో నివసించేవారు తమ ప్రాంతానికి చెందిన విద్యుత్ సరఫరాదారుని ద్వారా ఈ మీటర్లను పొందవచ్చాన్నారు. ఈ పథకాన్ని పొందాలంటే అద్దె ఇళ్లలో నివసించేవారు వారి చిరునామా పత్రం, అద్దె ఒప్పంద పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఇంటి యజమానికి ఎటువంటి అభ్యంతరం లేనట్లు ఒక పత్రాన్ని ఇవ్వాల్సింటుందన్నారు. ఈ పథకం వినియోగించేకునేవారు ముందుగా రూ.3000 సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాల్సివుంటుంది. వినియోగదారులు మీటర్లను ఉపయోగించడం ఆపేసిన తరువాత ఈ సొమ్ము తిరిగి ఇచ్చేయడం జరుగుతుందన్నారు.