telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

గుడ్ న్యూస్ : వ్యాక్సిన్ కోసం ఇక నుంచి ఆధార్ అవసరం లేదు

aadhar door delivery by postal dept

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.  కరోనాను అదుపు చేసేందుకు అన్నీ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అయితే  వ్యాక్సిన్ ప్రక్రియలో అనేక ఇబ్బందులు వస్తున్నాయి.  మనదేశంలో కరోనా వ్యాక్సిన్ లేదా కరోనా వైద్యం కోసం ఆధార్ కచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటేనే.. వ్యాక్సిన్ కోసం ఆరోగ్య సేతు యాప్‌ లేదా కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ లేకపోతే ఇక అంతే సంగతులు. అటు ఆస్పత్రిలో ఆధార్ లేకుంటే.. కరోనా వైద్యం అందించడం లేదు ఆస్పత్రులు. అయితే ఈ ప్రక్రియతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రుల్లో వైద్యం, మందులు, వాక్సిన్ విషయంలో ఆధార తప్పనిసరి కాదని ఆ సంస్థ తేల్చేసింది. ఆధార లేదని చెప్పి వ్యాక్సిన్ లను ఇవ్వడం నిరాకరించరాదని, అలాగే ఆధార్ లేకపోతే కరోనా సేవలను అందించలేమని చెప్పకూడదని యూఐడీఏఐ పేర్కొంది. ఈ మేరకు యూఐడీఏఐ ఓ ప్రకటన రీలీజ్ చేసింది.

Related posts