telugu navyamedia
రాజకీయ వార్తలు

చైనా, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు

america china

కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఇటీవల అమెరికా-చైనా మధ్య విభేదాలు మరింత పెరిగాయి. అయినప్పటికీ ఇరు దేశాలు తొలిద‌శ వాణిజ్య ఒప్పందంలో ముందడుగు వేయడం విశేషం. తాజాగా అమెరికా-చైనా విదేశాంగ మంత్రులు ఫోన్‌లో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో అమెరికా డిమాండ్లకు చైనా ఒప్పుకున్నట్లు తెలిసింది.

ఇటీవల చైనాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన హెచ్చరికల నేపథ్యంలో డ్రాగన్ వెనక్కు తగ్గి అమెరికాతో చర్చలు జరిపింది. తొలిద‌శ వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు ఈ ఏడాది జనవరిలోనే సంత‌కాలు చేసినప్పటికీ అనంతరం చైనాలో కరోనా వైరస్ గురించిన వార్తలు బయటకు రావడంతో ఒప్పందానికి అప్పట్లో తాత్కాలికంగా బ్రేక్ పడింది.

Related posts