telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వెబ్ సిరీస్ నిర్మించనున్న నాని

Nani

నాచురల్ స్టార్ నాని హీరోగా, ప్రొడ్యూసర్ గా విజయవంతంగా కొనసాగుతున్నాడు. అయితే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీల రాకతో వెబ్ సిరీస్ లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చాలామంది వెబ్ సిరీస్ ల వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా నాని కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. నాని ఓ వెబ్ సిరీస్ నిర్మించనున్నాడు అని ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం నాని, సుధీర్ బాబు క‌లిసి న‌టించిన ‘వి’ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబ‌ర్ 5న రిలీజ్ కాబోతున్న సంగ‌తి తెలిసిందే. కానీ నాని నటించిన “టక్ జగదీష్” మాత్రం థియేటర్లలోనే విడుదల చేయనున్నాడు నాని.

Related posts