telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ఉద్యోగుల విషయంలో గూగుల్ కీలక నిర్ణయం!

google doodle on voting in India

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ తమ ఉద్యోగులతో ఏడాదంతా ఇంటి నుంచే పని చేయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. గతనెలలో జూన్ వరకే వర్క్ ఫ్రమ్ హోమ్‌ అని చెప్పిన గూగుల్‌ తాజాగా దానిని 2020 ఏడాది ముగిసే వరకు పెంచినట్లు సమాచారం.

జూన్ లేదా జులై మొదటికి తమ కార్యాలయం తెరిచేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిన గూగుల్ తప్పనిసరి ఉద్యోగులు మాత్రమే కార్యాలయానికి వచ్చేవిధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. విధులకు హజరయ్యే ఉద్యోగులకు వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్త చర్యలూ చేపట్టనున్నట్లు గూగుల్ వర్గాలు వెల్లడించాయి.

Related posts