telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తాప్సీకి దిమ్మదిరిగే షాకిచ్చిన పోలీసులు.. కారణమిదే

హీరోయిన్‌ తాప్సి అంటే తెలియని వారుండరు. తాప్సి కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో “జుమ్మందినాదం” సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. ఆ తరువాత ఎన్నో తెలుగు సినిమాల్లో నటించింది. ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ప్రభాస్ తో నటించిన mr పర్ఫెక్ట్ తప్ప చెప్పుకోదగ్గ విజయాలు లేవు. ఈ సొట్టబుగ్గల భామ ఎక్కువగా తెలుగులో మంచు ఫ్యామిలితోనే ఎక్కువగా నటించింది. ఆ తరువాత బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ అక్కడే బిజీ అయిపోయింది. అంతేకాకుండా హైదరాబాద్ నుండి ఏకంగా ముంబై కి మాకాం మార్చేసింది. ఇదిలా ఉండగా ముంబయి పోలీసులు తాప్సి కి షాక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే స్వతహాగా రైడింగ్ ని ఇష్టపడే తాప్సి కూడా ఒక రోజు రైడింగ్ కి వెళ్ళింది. రైడింగ్ చేయడంలో ఏమి తప్పు లేదు కాని హెల్మెట్ లేకుండా రైడింగ్ చేసినందుకు పోలీసులు తాప్సి కి ఫైన్ వేశారు. ఈ విషయాన్ని స్వయంగా తాప్సి నే తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తాను చేసిన తప్పును తన అభిమానులు చేయకూడదని తెలిపింది. ప్రస్తుతం తాప్సి “రష్మీ రాకెట్” అనే సినిమా షూటింగ్ లో బిజీ గా ఉంది. ఆకర్ష్ ఖురాన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

Related posts