telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఖర్జూరం తో .. పలు ఉపయోగాలు..

dates soaked in honey is very good for health

ఖర్జూరం శరీరానికి తక్షణ శక్తినిచ్చే పండ్లలో ముందు వరసలో ఉంటుంది. ఖర్జూరాన్ని ‘ప్రోటీన్స్‌ పవర్‌ హౌస్‌’ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే.. ఇందులో అనేక రకాలైన పోషక విలువలు ఉన్నాయి. ఇందులో విటమిన్‌ ఎ,బి లతో పాటు కాల్షియం, ఐరన్‌, పాస్పరస్‌, ఫైబర్‌ పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉన్నాయి. వీటిల్లో కొలెస్ట్రాల్ ఉండదు. అలాగే కొవ్వు శాతం కూడా తక్కువే. పిల్లలనుండి పెద్దలదాకా ఎంతో ఇష్టంగా తినే పండు ఖర్జూరాలు. చూడటానికి ఈతపండులా ఉండే ఖర్జూరం అందరికీ ప్రీతిపాత్రమే. శారీరక శ్రమ చేసేవారు రోజూ ఖర్జూర తినడం ఆరోగ్యానికి మంచిది. జ్ఞాపకశక్తి తగ్గిన వారు ఖర్జూర తరచూ తింటే మరలా మామూలు స్థితికి వస్తారు. ఖర్జూరం జ్యూస్ ను రెగ్యురల్ గా తాగడం వల్ల చర్మానికి పోషణ బాగా అందుతుంది. దాంతో చర్మానికి మంచి గ్లో వస్తుంది.

ఖర్జూరాలు చక్కగా జీర్ణం అవ్వడమే కాదు… ఇవి ఆహారనాళం, పెద్ద ప్రేగును బ్యాక్టీరియా నుంచీ దూరం చేస్తాయి. అందువల్ల అత్యంత ప్రమాదకరమైన కొలొన్ క్యాన్సర్ బారి నుంచీ పెద్ద ప్రేగును కాపాడినట్లవుతుంది. అసిడిటీని అదుపులో ఉంచుతాయి. వీటిల్లోని పీచు అరుగుదలకు సాయపడుతుంది. ఖర్జూరాలకు మన శరీరంలో వేడిని తగ్గించే అద్భుత గుణాలున్నాయి. వీటికి తేనె కూడా తోడవడం వల్ల దగ్గు, జలుబు, పడిశం వంటివి త్వరగా నయం అవుతాయి. అలాగే ఖర్జూరాన్ని పాలల్లో నానబెట్టి తింటే చక్కగా నిద్రపడుతుంది. మిగిలిన డ్రైఫ్రూట్స్‌తో పోలిస్తే ఖర్జూరంలో శక్తినందించే క్యాలరీలు అధికంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వలన శరీరానికి కావల్సిన రోజువారీ పోషకాలు అందుతాయి. మరియు కర్జూరం జ్యూస్ రెగ్యులర్ గా తాడం వల్ల రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ పెరుగుతుంది.

Related posts