యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ను ఇప్పటికే కొంతవరకు పూర్తి చేసారు. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా లాక్ డౌన్ విధించటంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఈ చిత్రానికి ‘రాధేశ్యామ్’ అనే టైటిల్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఇది ప్రభాస్ కు 20వ చిత్రం. ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారంటూ ట్రేడ్ అనలిస్ట్ శివ సత్యం తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు ‘రాధేశ్యామ్’ అనే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.