telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగాస్టార్ సినిమాలోంచి తప్పుకున్న త్రిష…!!!

chiru

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్యకు కొరటాల దర్శకత్వం వహిస్తున్నారు. సామాజిక కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోందని మూవీ నిర్మాతల్లో ఒకరైన రామ్ చరణ్ ఓ సందర్భంలో వెల్లడించారు. దీంతో చిరుతో త్రిష రెండో సారి రొమాన్స్ చేయనుందని అందరూ అనుకున్నారు. ఇక అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ వారంలో త్రిష ఆచార్య షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ లోపే ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఆమె తప్పుకోవడంతో అందరికీ షాక్ తగిలినట్లైంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు త్రిష్ సోషల్ మీడియాలో తెలిపారు. “కొన్ని సార్లు మనకు చెప్పిన విషయాలు, చర్చించిన విషయాలు మారొచ్చు. కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన నేను చిరంజీవి గారి సినిమా నుంచి తప్పుకున్నా. మరో ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్‌తో తెలుగు ప్రేక్షకులను త్వరలో పలకరిస్తా” అని త్రిష కామెంట్ పెట్టారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు ఆమె విషెస్ చెప్పారు. మరి ఏ కారణం వలన త్రిష ఈ మూవీ నుంచి తప్పుకుంది..? చిరు జోడీగా ఎవరు నటిస్తారు..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Related posts