అవడానికి తెలుగమ్మాయి అయినా తెలుగు కంటే తమిళ్‌లోనే బాగా పాపులర్ అయ్యింది అంజలి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలుకు చెందిన అమ్మాయే అంజలి. రాజమహేంద్రవరంలో చదువుకున్న ఆమె ఆ తర్వాత సినిమా పిచ్చితో చెన్నైకి చెక్కేసి అక్కడ హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత తెలుగులో కూడా అంజలి వెంకీ, బాలయ్య లాంటి సీనియర్ హీరోలతో ఆడిపాడింది. మూడున్నర పదుల వయస్సు దాటేసిన అంజలి కొద్ది సంవత్సరాలుగా కోలీవుడ్ హీరోయిన్ జైతో ప్రేమలో ఉందని.. అతడినే పెళ్లాడబోతోందని వార్తలు వస్తూ ఉన్నాయి. వీరిద్దరు కలిసి మెలిసి ఉండడంతో పాటు ఒకే ఇంట్లో సహజీవనం చేస్తోన్న ఫొటోలు కూడా రివీట్ చేశారు. ఆ తర్వాత ఏమైందో గాని వీరి మధ్య ఏవేవో తేడాలు వచ్చాయని… దూరంగా ఉంటున్నారన్న టాక్ బయటకు వచ్చింది.
తాజాగా తన పెళ్లిపై కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడిన అంజలి… తాను పెళ్లి చేసుకునేది తమిళ అబ్బాయినే అని చెప్పింది. ఇక జైతో బ్రేకప్ తర్వాత తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే… ప్రేమికులం కాదు అంటూ చెప్పుకొచ్చింది . ఇక జై కూడా అలాగే అన్నాడు. దీంతో వీరు విడిపోయారేమో అన్న సందేహాలే ఇప్పటి వరకు అందరికి ఉన్నాయి. ఇప్పుడు సడెన్‌గా మీడియా ముందుకు వచ్చిన అంజలి నేను పెళ్లి చేసుకునేది తమిళ అబ్బాయినే అంటూ ఖరాకండిగా చెప్పేసింది . అంటే తమిళ హీరో జై నే పెళ్లి చేసుకుంటాను అని పరోక్షంగా చెప్పినట్లా ? లేదా ఆమె మదిలో మరో హీరో ఉన్నారా ? అన్నది మాత్రం అంతు పట్టడం లేదు.