telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తెలుగు సినిమాలో నిత్యామీనన్ సాంగ్

Nitya-Menon

టాలెంటెడ్ హీరోయిన్‌గా ప్రత్యేకతను చాటుకున్న హీరోయిన్లలలో ఒకరుగా నిత్యామీనన్ పేరు సంపాదించుకుంది. అలాగే గ్లామర్ విషయంలో తనకంటూ కొన్ని పరిధులు విధించుకుని, వాటికి కట్టుబడే సినిమాలు చేస్తుంది. నిత్యామీనన్‌కు నచ్చితేనే ఏ సినిమా అయినా చేస్తుంది. లేదంటే ఎంత పెద్ద ఆఫర్ అయినా సరే.. ఆమెను ఒప్పించడం చాలా కష్టం. ఇక ఈ మల్లూబేబీ తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘నిన్నిలా నిన్నిలా’ అనే తెలుగు సినిమా కోసం ఓ పాట పాడింది. ప్రముఖ మలయాళ దర్శకుడు దివంగత ఐవీ శశి తనయుడు అనీ శశి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో అశోక్ సెల్వన్ హీరోగా నటిస్తుండగా, నిత్యామీనన్, రీతు వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం కోసం నిత్య పాడిన పాటను బెంగళూరులోని రఘు దీక్షిత్ స్టూడియోలో రికార్డు చేశారు. ఇక యూకేలో ఉంటున్న సరోద్ విద్వాంసుడు సౌమిక్ దత్తాతో కలసి నిత్యామీనన్ తన తొలి ఇంగ్లిష్ సింగిల్ ను తీసుకురానుంది.

Related posts