telugu navyamedia
సినిమా వార్తలు

“దంగల్” హీరోయిన్ సంచలన నిర్ణయం… భద్రత పెంచిన ప్రభుత్వం

Zaira Wasim

అమీర్ ఖాన్ నటించిన “దంగల్” చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిన విషయమే. అయితే ఆ సినిమాలో కీలకపాత్ర పోషించిన జైరా వసీంకు నటిగా మంచి గుర్తింపు రావడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఇక ఆమెకు బాలీవుడ్ లో తిరుగులేదనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా తాను ఇకపై సినిమాలలో నటించడం లేదని జైరా ట్వీట్ చేయడం బాలీవుడ్ తో పాటు రాజకీయంగా కూడా దుమారం చెలరేగుతోంది. తాను బాలీవుడ్ కు సరిపడనంటూ, ఇకపై సినిమాల్లో నటించేది లేదు అంటూ జైరా వసీం తీసుకున్న నిర్ణయం చర్చకు దారి తీస్తోంది. గత కొంత కాలంగా జైరా వసీంకు బెదిరింపులు ఎదురవుతున్నాయి. దీనితో ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరికొంత మంది ఆమె సోషల్ మీడియా హ్యకై ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా హ్యాకింగ్ కి గురి కాలేదని, సినిమాల నుంచి తప్పుకోవడం అనేది పూర్తిగా తన నిర్ణయమేనని.. ఇందులో ఎవరి ఒత్తిడి లేదని జైరా మరో ట్వీట్ చేసింది.

ప్రస్తుతం జైరా వసీం నిర్ణయంపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. జైరా వసీం తీసుకున్న నిర్ణయంపై రాద్దాంతం వద్దు. ఆమెకు ఏది సంతోషమో అది చేయనివ్వండి. ఆమె జీవితం మొత్తం మంచి జరగాలని కోరుకుంటున్నట్లు జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. జైరా వసీం సినిమాల నుంచి తప్పుకోవడం అల్లా నిర్ణయం అంటూ సమాజ్ వాద్ పార్టీ ఎంపీ ఆజామ్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మహిళలు విధిగా బుర్ఖా ధరించాలని, సినిమాల్లో నటించడం తమ ఆచారాలకు విరుద్ధం అని అన్నారు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జైరా వసీంకు భద్రత పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జైరా వసీం ఎంతో ధైర్యం ఉన్న యువతి. ఇలాంటి సమయంలో ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తున్నాను అని అలనాటి నటి నగ్మా ఆమెకు మద్దతు పలికారు. మరో బాలీవుడ్ నటి రవీనా టాండన్ మాత్రం ఆదరించిన బాలీవుడ్ పై నిందలు వేసి వెళ్లిపోవడం తగదని అన్నారు.

Related posts