telugu navyamedia
సినిమా వార్తలు

హాట్ సీన్లకు ఫీల్ ఉండాల్సిందే… రాధికా ఆప్టే హాట్ కామెంట్స్

Radhika-Apte

బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే సినిమాల కంటే తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడంతోనే ఎక్కువ గుర్తింపును సొంతం చేసుకున్నారు. బోల్డ్ గా మాట్లాడమే కాదు ఏ విషయం గురించైనా ధైర్యంగా మాట్లాడుతుంది ఈ ముద్దుగుమ్మ. మ‌న‌సులో ఉన్న‌ది ఉన్న‌ద‌ట్టుగా బయటపెట్టేస్తుంది. ఇటీవల బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ నేహా ధూపియా నిర్వ‌హిస్తున్న ఓ టాక్ షోకు హాజరైన రాధికా… నేహ అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన శైలిలో హాట్ గా స‌మాధానమిచ్చింది. “రొమాంటిక్ సీన్స్ షూట్ చేస్తున్న సమయంలో ఎప్పుడైనా ఫీలింగ్స్ క‌లిగిన‌ సందర్భాలున్నాయా? అంటూ రాధిక‌ను నేహ ప్రశ్నించింది. దీనికి రాధికా స్పందిస్తూ… “అఫ్‌కోర్స్‌.. అది స‌హ‌జం. నా కెరీర్‌లో అలాంటి ఘ‌ట‌న‌లు ఉన్నాయి. న‌ట‌న‌లో భాగ‌మే క‌దా అని అలాంటి స‌న్నివేశాల్లో ఎలాంటి ఫీలింగ్ లేకుండా న‌టించేయ‌లేం. నిజానికి ఫీల్ అయితేనే స‌న్నివేశం స‌హజంగా వస్తుంది ? అని రాధిక చెప్పింది. “ఎవ‌రితోనైనా ప్రేమ‌లో ప‌డ్డావా?” అనే ప్ర‌శ్న‌కు స్పందిస్తూ “షూటింగ్ స‌మ‌యాల్లో నాకు ఎదురైన చాలా మంది వ్య‌క్తులు న‌న్ను ఆక‌ర్షించారు. అందులో కొంత మంది నా మ‌న‌సుకు న‌చ్చారు. వారితో ప్రేమ‌లో ప‌డ్డాను” అని రాధిక చెప్పింది.

Related posts