telugu navyamedia
సినిమా వార్తలు

‘అచలుడు’గా వ‌స్తున్న సూర్య ..ఆస‌క్తిరేపుతున్న పోస్ట‌ర్‌

సూర్య హీరోగా బాల దర్శకత్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతుంది. సూర్య 41 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుంది. 2డి ప్రొడక్షన్‌లో భార్య జ్యోతికతో కలిసి సూర్య స్యయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. తమిళంతోపాటు, తెలుగు, మలయాళంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టైటిల్‌ను డైరెక్ట ర్ బాలా పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు మూవీ మేక‌ర్స్.ఈ సినిమాకి అచలుడు (వనంగాన్ ) అని పేరు పెట్టారు ‘అచలుడు’ అంటే.. దేనికి చలించనివాడు అని అర్థం.

ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో సూర్య చిరిగిన‌ గుడ్డలోంచి గంభీరంగా చూస్తు కనిపించాడు. ఈ సినిమాలో సూర్య మ‌త్స్యకారునిగా చేయ‌నున్న ట్టు తెలుస్తోంది.

Suriya 41': 5 things to know about Suriya, Bala's next | NewsBytes

కాగా దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ తో సూర్య, డైరెక్టర్ బాలా మళ్లీ క‌లిసిప‌నిచేయ‌బోతున్నారు. వీరిద్దరూ గతంలో రిలీజ్ అయిన‌ నందా (2001), పితామగన్ (2003) సినిమాల్లో క‌లిసి ప‌నిచేశారు. 2003లో రిలీజ్ అయిన యాక్షన్-డ్రామా మూవీ పితామగన్ లో సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ కూడా నటించారు.

ఈ సినిమాలో విక్రమ్ తన అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు కూడా గెలుచుకున్నాడు. పితామగన్ మూవీ ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకుంది. అందులో సూర్య ఉత్తమ సహాయ నటుడిగా, బాలాకు ఉత్తమ దర్శకుడు, విక్రమ్‌కు ఉత్తమ నటుడు, లైలాకు ఉత్తమ నటి, సంగీతకు ఉత్తమ సహాయ నటిగా స‌త్కారం దక్కింది.

Related posts