telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బంపర్ ఆఫర్ కొట్టేసిన సత్యదేవ్….

రాజకీయాల కారణంగా గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలను ఒకే చేస్తున్నారు ఇప్పటికే ఖైదీ 150, సైరా సినిమాలతో మంచి విజయాలను అందుకున్న మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . ఇక ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ మరో మూడు సినిమాలు చేయబోతున్నారు. వీటిలో  మలయాళం లో సూర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. అయితే ఈ సినిమాను మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్  చేసారు. ఈ సినిమాను తెలుగులో మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ బయటికి వచ్చింది. మలయాళం లూసిఫర్ లో మరో హీరో ”పృథ్వీరాజ్ సుకుమారన్” ఓ ముఖ్య పాత్రలో నటించారు. అయితే తెలుగు రీమేక్ లో హీరో సత్య దేవ్ ఆ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మధ్యే సత్య దేవ్ చిరు తో దిగ్గిన ఓ ఫోటో వైరల్ అయిన విషయం తెలిసిందే. చూడాలి మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది.

Related posts