telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఏ” చిత్రం టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం

a

అవంతిక ప్రొడక్షన్స్ “ఏ” చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నితిన్ ప్రసన్న, ప్రీతీ అశ్రాని, బేబీ దీవెన, రంగాథం, కృష్ణవేణి, భరద్వాజ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించారు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసిన యుగంధర్ ముని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. టైటిల్ పోస్టర్ విడుదల సందర్భంగా దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ.. ఈ సినిమా కథాంశం అద్భుతంగా ఉంటుంది. ఇప్పటివరకు ప్రపంచ సినిమాల్లో కూడా రానటువంటి ఒక విభిన్నమైనటువంటి కథ. 1977 నుంచి 2019 మధ్య ఈ కథ నడుస్తుంది అన్నారు. నాతో సహా మిగిలిన టెక్నీషియన్స్ అందరూ కూడా ఫిల్మ్ స్కూల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్లే. సినిమా టెక్నికల్‌గా అద్భుతంగా వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. నటీనటుల కోసం దాదాపు నాలుగు నెలల్లో 300కి పైగా ఆడిషన్స్ చేశాము. ఖచ్చితంగా థ్రిల్లర్ జోనర్ ప్రేక్షకులకు ఒక క్రొత్త అనుభూతిని మరియూ సంతృప్తిని ఇస్తుంది. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా శంషాబాద్ దగ్గర్లో ఒక సెట్‌ను నిర్మించి కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించటం జరిగిందని తెలిపారు.

Related posts