telugu navyamedia
క్రైమ్ వార్తలు

లోన్‌ యాప్ వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య..

*లోన్‌ యాప్ వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య
*ఆత్మ‌హ‌త్య‌కు ముందు యువ‌తి సెల్ఫీ వీడియో
*బంధువుల‌కు మెసెజ్‌లు పంపిస్తామ‌ని బెదిరింపులు

లోన్‌ యాప్ వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామానికి చెందిన బండపల్లి ప్రత్యూష ఇండియన్‌ బుల్స్‌, రూపెక్స్‌ యాప్స్‌ నుంచి రూ.20,000 లోన్‌ తీసుకుంది. రూ.20 వేల రుణానికి లోన్‌ యాప్స్‌ నిర్వాహకులు రూ. 2 లక్షల వరకు వసూలు చేశారు.

దాదాపు రూ. లక్ష 80 వేలు ఎక్కువ కట్టించుకున్నా వారు ఇంకా డబ్బులు కట్టాలని బెదిరించారు. లేకుంటే ప్రైవేటు ఫోటోలు సోషల్‌ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేశారు. బంధువులకు ఫోన్ చేసి పరువు తీస్తామని ఆందోళనకు గురి చేశారు.

 వాట్సాప్‌లో అసభ్యకర మెసెజ్‌లు పంపుతూ వేధింపులకు పాల్ప‌డంతో తో మనస్తాపం చెందిన ప్రత్యూష ఇంటిపైన ఉన్న ఫ్లెక్సీ హోర్డింగ్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు తల్లిదండ్రులకు, భర్తకు సెల్ఫీ వీడియో పంపింది. ఈ మేరకు ప్రత్యూష భర్త మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Related posts