హైదరాబాద్ లో భారీగా గుట్కా స్వాధీనం చేసుకున్నారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ , బహదూర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్కా గోడౌన్ ల పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు చేసారు. రాణీ బ్రాండ్ కు చెందిన 31 బ్యాగ్ లను, 63 వేల ప్యాకెట్ల సీజ్ చేసారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. సీజ్ చేసిన గుట్కా విలువ 63 లక్షలు. ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్బంగా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. మొత్తం 63 లక్షల 96 వేల రూపాయల గుట్కా ను సీజ్ చేసాం. 41 గుట్కా బ్యాగ్స్ ను స్వాధీనం చేసుకున్నాము. గోడౌన్ లో కాకుండా హిందూస్థాన్ ట్రాన్స్పోర్ట్ నుండి తరలిస్తున్న 10 గుట్కా బ్యాగ్స్ ను కూడా పట్టుకున్నాము అని తెలిపారు.
నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పక్క సమాచారం తో అక్రమంగా గుట్కా తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. మీర్జాల్ ఫజిల్ హుస్సేన్ , దస్తగిరి అబ్బాస్ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసాము. దీని వెనుక ఉన్న అసలు సూత్ర దారులను కూడా త్వరలో పట్టుకుంటాము అన్నారు.ట్రాన్సర్ట్ పేరుతో గుట్కా ను సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు.