telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

భర్త పక్కనుండగానే… నిద్రలో ఉన్న భార్య బట్టలు కత్తిరించి… 

Sex

వారిద్దరూ థాయ్‌లాండ్ అందాలు చూడటానికి వచ్చిన బ్రిటన్ దంపతులు. అక్కడి కోఫిఫి దీవుల్లో పగలంతా పర్యటించి, అక్కడి అందాలను ఆస్వాదించారు. అక్కడే చీకటి పడడంతో హోటల్‌కు తిరిగి రావడం కుదరలేదు. దీంతో తాము భోజనం చేసిన ఓ రెస్టారెంటు ముందు ఉన్న ఖాళీ స్థలంలో ఓ కునుకు తీద్దామని అనుకున్నారు. అక్కడే పడుకున్నారు. వారు నిద్రపోయిన కాసేపటికి అటుగా వచ్చాడో స్థానిక యువకుడు. రోడ్డు పక్కనే పడుకొని ఉన్న అందమైన అమ్మాయిని చూడగానే అతనికి పిచ్చి ఆలోచనలు కలిగాయి. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో… తన వద్ద ఉన్న కత్తెరతో ఆమె దుస్తులన్నీ కత్తిరించేశాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. ఇదంతా దగ్గరలోని ఓ సీసీ కెమెరాలో రికార్డయింది. ఉదయం లేవగానే తనున్న పరిస్థితిని చూసుకున్న ఆ మహిళ వెంటనే పోలీసులను సంప్రదించింది. అక్కడి సీసీ కెమెరాను పరిశీలించిన పోలీసులు… నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.

Related posts