telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సీఎం జగన్ విశాఖ పర్యటన వాయిదా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పర్యటన వాయిదా పడింది. రేపు విశాఖలో సీఎం జగన్ వాహనమిత్ర లబ్దిదారులకు న‌గ‌దు విడుదల చేయాల్సి ఉంది.. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

కానీ ఏపీలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి..మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ముఖ్యమంత్రి జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

అయితే జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ను ఈ నెల 15కు వాయిదా వేస్తున్న‌ట్లు ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌కటించింది. పూర్తి స్థాయి షెడ్యూల్ రేపు విడుదల చేయనుంది.

రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశం చేపట్టారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా గోదావరి ఉధృతి, వరద సహాయక చర్యలపై సీఎం జగన్‌ దిశనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

 

Related posts