telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అనుకున్న సమయానికే పోలవరం పూర్తి చేస్తాం…

cm jagan ycp

పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్‌ సమీక్ష ఇవాళ నిర్వహించారు. సమీక్షకు ముందు పోలవరం పర్యటనలో భాగంగా తొలుత ఏరియల్‌ వ్యూ ద్వారా ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం జగన్‌ పరిశీలించారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అనంతరం ప్రాజెక్టు అధికారులతో మాట్లాడుతూ… 2022 ఖరీఫ్‌ నాటికి సాగునీరు ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ప్రాజెక్టు ఒక్క మిల్లీ మీటరు కూడా తగ్గించడం లేదని స్పష్టం చేశారు. వచ్చే జూన్‌ 15 నాటికి మళ్లీ గోదావరిలోకి నీళ్లు వస్తాయని.. పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని తెలిపారు. అనుకున్న సమయానికే పోలవరం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పొరపాటు జరిగితే పనులు మళ్లీ ఒక సీజన్‌ ఆలస్యమయ్యే అవకాశం ఉందని…మే నెలాఖరునాటికి స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ పనులు పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌. పునరావాస కార్యక్రమాలకు రూ. 3330 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని.. అందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాగా.. పోలవరం పర్యటన ముగించుకుని హెలికాప్టర్‌లో సీఎం జగన్‌ తాడేపల్లికి బయలు దేరారు.

Related posts