telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

నాగార్జున జగన్ మోహన్ రెడ్డిని  ఎందుకు కలిశాడంటే … ?

Nagarjuna,YS Jagan
అక్కినేని నాగార్జున, నిన్న  వై.ఎస్.ఆర్.పార్టీ  అధ్యక్షుడు జగన్  మోహన్ రెడ్డిని కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. నాగార్జున రాజకీయాల్లో వస్తున్నాడని, జగన్ పార్టీలో చేరుతున్నాడని, గుంటూరు నుంచి ఎమ్.పి గా పోటీ చేస్తున్నాడని  అనేక రకాల ఊహాగానాలు  వచ్చాయి. అయితే దేనిపైనా  స్పష్టత  రాలేదు. నాగార్జున, జగన్ మోహన్ రెడ్డిని కలిసిన తరువాత మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అందుకే  ఎవరికీ తోచినట్టు వారు కథలు అల్లేశారు. 
Nagarjuna,Jagan Mohan Reddy
నాగార్జున, జగన్ మోహన్ రెడ్డ ల స్నేహం ఇప్పటిది కాదు. పది సంవత్సరాల కు పైగా వారు మంచి ఫ్రెండ్స్. గతంలో అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఎకరాలను ఇద్దరు కలసి కమర్షియల్ గా డెవలప్ చేయాలనుకున్నారు. అందుకు ప్లాన్స్  కూడా  తయారు చేయించారు. అయితే  రాజశేఖర్ రెడ్డి  హఠాత్తుగా మరణించడం, ఆ తరువాత కమర్షియల్ గా మార్చడానికి అనుమతి రాకపోడంతో  ఆ ప్రతిపాదన ఆగిపోయింది. 
అప్పుడు నష్టాల్లో వున్న అన్నపూర్ణ స్టూడియోస్ ను నిమ్మగడ్డ ప్రసాద్ ఆర్ధికంగా ఆదుకున్నాడు. అయితే ఇప్పుడు హఠాత్తుగా  నాగార్జున జగన్మోహన్ రెడ్డిగాని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదీ ఎన్నికల వేళ, జగన్ విదేశీ పర్యటన  హడావిడిలో వున్నప్పుడు  జగన్ తో కలవడం వల్ల  నాగార్జున రాజకీయాల్లో వస్తున్నాడనే  ప్రచారం జరుగుతోంది. 
Nagarjuna,Jagan Mohan Reddy
నాగార్జునకు మొదటి నుంచి రాజకీయాలంటే ఇష్టం లేదు. తన వ్యాపారాల కోసం రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నాడు. తన స్టూడియోను నిలబెట్టడాని కుమారులు నాగ చైతన్య, అఖిల్ కు హీరోలను చేశాడు, తానూ కూడా నటిస్తున్నాడు. నాగార్జున నిజ జీవితంలో కూడా మన్మధుడే. ఆయనకు గ్లామర్  ప్రపంచం అంటే ఎంతో ఇష్టం. 
సినిమాను వదిలి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన నాగార్జునకు లేదు. జగన్ మోహన్ రెడ్డి తో నాగార్జున కలవడానికి ముఖ్య కారకుడు మాట్రిక్ ప్రసాద్. తనకు అన్ని విధాలా ఆర్ధికంగా చేయూత నిస్తున్న ప్రసాద్ అంటే నాగార్జునకు ఎంతో అభిమానం. నాగార్జున జగన్ మోహన్ రెడ్డి ని నిమ్మగడ్డ ప్రసాద్ కోసం  కలిశాడని తెలుస్తుంది ఒకప్పుడు మ్యాట్రిక్ ప్రసాద్ అటు చంద్ర బాబుకు, ఇటు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడు. 
Nagarjuna,Jagan Mohan Reddy
జగన్ కంపెనీల్లో ప్రసాద్ పెట్టుబడులు కూడా పెట్టాడు. ఆ పెట్టుబడుల కేసులో  2012లో సీబీఐ ప్రసాద్ ను  అరెస్టు చేసి చెంచలగూడ జైల్లో పెట్టింది అప్పుడు తన మిత్రుడైన ప్రసాద్ ను కలవడానికి నాగార్జున చంచలగూడ జైలుకు వెళ్లి  వచ్చాడు. 2013లో నిమ్మగడ్డ ప్రసాద్ కు  బెయిలు వచ్చింది. ఆ తరువాత ప్రసాదుతో నాగార్జునకు వ్యాపార సంబంధాలు ఏర్పడ్డాయి. 
మా టివి కాక అనేక కంపెనీల్లో  ఇద్దరు కలసి  పెట్టుబడి పెట్టారు. నిమ్మగడ్డ  ప్రసాద్ కు రాజకీయాలంటే ఇష్టం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చెయ్యాలనే ఆలోచనతో వున్నాడు. వై ఎస్ ఆర్ పార్టీలో చేరి గుంటూరు నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే  గుంటూరు పార్లమెంట్ సీట్ కు అధిక పోటీ ఉండటంతో  తన మిత్రుడు ప్రసాద్ కోసం నాగార్జున  జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లాడని బలంగా వినిపిస్తుంది. 
ఈ వార్తే నిజం కావచ్చు. 

Related posts