telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

దిశ నేరస్తుల ఎన్కౌంటర్ పై.. పలువురి స్పందన..న్యాయం జరిగిందంటున్న కుటుంబసభ్యులు..

disa family and others comments on encounter

శంషాబాద్ లో వెటర్నరీ వైద్యురాలు దిశ హత్య కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ దగ్గర ఎన్‌కౌంటర్‌ చేసినట్లు తెలిసింది. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా తప్పించుకునేందుకు నిందితులు యత్నిస్తుండగా ఎన్‌కౌంటర్ చేసినట్లు చెబుతున్నారు. నిందితులను ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నేత నారాయణ స్పందించారు. దిశ హత్యాచార కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం సమర్థనీయమే అని నారాయణ స్పష్టం చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌ను సీపీఐ సమర్థిస్తుందని పేర్కొన్నారు. దిశ హత్యచారం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి శిక్షలు సమర్థనీయమే అని ఆయన తెలిపారు.

దిశపై హత్యాచారం జరిపిన నిందితుల ఎన్ కౌంటర్ పై హీరో ఎన్టీఆర్ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టిన ఆయన, న్యాయం జరిగింది. ఇక దిశ ఆత్మ శాంతిస్తుంది అని వ్యాఖ్యానించారు. ఈ తెల్లవారుజామున తమ కస్టడీలో ఉన్న నిందితులను ఘటనా స్థలికి పోలీసులు తీసుకువెళ్లిన సమయంలో వారు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో నిందితులంతా హతులైన సంగతి తెలిసిందే. ఎన్ కౌంటర్ పై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పక్కా ప్లాన్ వేసి, దిశపై దారుణంగా అత్యాచారానికి పాల్పడి, ఆపై ఆమెను సజీవదహనం చేసిన నలుగురు నిందితులూ హతమయ్యారు. ఈ ఉదయం నిద్ర లేవగానే తెలుగు రాష్ట్రాల ప్రజలకు వినిపించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఎక్కడైతే దిశను కాల్చారో, సరిగ్గా అదే ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్ కౌంటర్ జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్న చుట్టుపక్కల వారు పెద్దఎత్తున ఘటనాస్థలికి వచ్చారు. వందలాది మంది ఆ ప్రాంతంలో చేరి పోలీసులూ జై, జస్టిస్ ఫర్ దిశ, సజ్జన్నార్ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారు, తమ వాహనాలను సైతం బ్రిడ్జ్ వద్ద ఆపి ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతుండటంతో ట్రాఫిక్ స్తంభించింది. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను ఇప్పటికే తరలించిన అధికారులు, ట్రాఫిక్ ను క్రమబద్దీకరించే పనిలో పడ్డారు. ప్రజలు మాత్రం ఈ ఎన్ కౌంటర్ పై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారాలకు పాల్పడే వారికి ఇటువంటి శిక్షలే పడాలని, అప్పుడే మరొకరు ఇంత దారుణానికి పాల్పడాలన్న ఆలోచన కూడా చేయబోరని అంటున్నారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. దిశ ని కాల్చిన చోటే నిందితులని ఎన్‌కౌంటర్ చేయడంతో తమ బిడ్డకు తగిన న్యాయం జరిగిందని, నిందితులకు తగిన శిక్ష పడిందని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఎన్‌కౌంటర్‌ జరిగిన సమాచారం తెలుసుకుని … సంఘటనా స్థలానికి స్థానికులు భారీగా తరలి వస్తున్నారు. చటాన్‌పల్లి బ్రిడ్జ్‌ వద్దకు చేరుకున్న స్థానికులు…పోలీసులు జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసి మంచి పని చేశారంటూ పోలీసులు, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అభిప్రాయాన్నే పోలీసులు అమలు చేశారని అభిప్రాయపడ్డారు. సీఎం జిందాబాద్‌, పోలీసులు జిందాబాద్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డాక్టర్ దిశ సోదరి మీడియాతో మాట్లాడారు. నిందితులకు ఉరిశిక్ష పడుతుందని భావించామని అంతకు మించి న్యాయం జరిగిందని అన్నారు. అసలు ఎక్స్ పెక్ట్ చెయ్యలేదు అని అన్నారు. అక్క పాప ఆత్మకు శాంతి జరిగింది. అక్యూజ్ ని తొమ్మిది రోజుల్లో ఎన్ కౌంటర్ చెయ్యడాన్ని స్వాగతించారు. హ్యాంగ్ చేస్తాం అనుకున్నా కానీ ఇటువంటి న్యాయం ఊహించలేదని అన్నారు. నేటి తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య పోలీసులు ‘దిశ’ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లు ప్రకటించారు. ‘దిశ’ ఘటన జరిగిన స్థలంలోనే కామాంధులు ఎన్‌కౌంటర్ అయ్యారు.

Related posts