రెండు నెలల క్రితం అజయ్, ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో పాల్గొనగా అక్కడ ఆయన తీరుకు అందరూ షాక్‌కు గురయ్యారట. అసలు మనం పనిచేస్తున్నది నిజంగా అజయ్ దేవగన్‌తోనేనా అని చాలా మందికి అనుమానం వచ్చిందట. ఎందుకంటే సెట్స్‌లో అజయ్ అంత సింప్లిసిటీగా ఉంటారట. డ్రస్ మార్చుకోవడానికి తప్ప అజయ్ ఎప్పుడూ తన కార్వాన్‌లోకి వెళ్లరట. అంతేకాదు భోజనం కూడా అందరితో కలిసి చెట్ల కింద తింటుంటారని ఒకవేళ అక్కడ చెత్త ఉన్నా కూడా ఆయన అవేమీ పట్టించుకోకుండా అందరిలో కలిసి పోయేవారని రాజమౌళి చెప్పుకొచ్చారు. అజయ్ తీరుతో మూవీ యూనిట్ మొత్తం ఆశ్చర్యపోయారని ఆయన చెప్పుకొచ్చారు.ఆయనతో పనిచేయడం తన అదృష్టం అని రాజమౌళి వెల్లడించారు.
previous post