telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

67 సంవత్సరాల “మాయా బజార్” (తమిళ్)

నందమూరి తారకరామారావు గారు పూర్తి స్థాయిలో శ్రీకృష్ణుడు గా నటించిన తమిళ చిత్రం విజయా వారి
“మాయా బజార్” తమిళ్ సినిమా 12-04-1957 విడుదలయ్యింది.
నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి లు విజయా బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డి గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి కథ: పింగళి నాగేంద్రరావు, మాటలు,పాటలు: తంజై రామయ్యదాస్, సంగీతం: ఘంటసాల, ఫోటోగ్రఫీ: మార్కస్ బార్ట్లీ, కళ: మాధవపెద్ది గోఖలే,సూరపనేని కళాధర్, నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి, గోపీనాద్, కూర్పు: సి.పి.జంబులింగం, జి.కల్యాణ సుందరం అందించారు
ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు(శ్రీకృష్ణుడు),
ఎస్.వి.రంగారావు (ఘటోత్కచుడు),
సావిత్రి(శశిరేఖ), జెమినిగణేషన్(అభిమన్యుడు),
మిగిలిన పాత్రలలో కె.ఎ.తంగవేలు, ఎం.ఎన్.
నంబియార్, డి.బాలసుబ్రహ్మణ్యం, ఆర్.బాలసుబ్రహ్మణ్యం, ఇ.ఆర్.సహదేవన్, టి.పి.ముత్తులక్ష్మి, సంధ్య, ఋష్యేంద్రమణి, లక్ష్మీప్రభ, చదలవాడ, నల్ల రామమూర్తి, అల్లు రామలింగయ్య, వంగర, మాధవపెద్ది సత్యం తదితరులు నటించారు.

నిర్మాతలు ఈ సినిమాను తెలుగు,తమిళ భాషలలో సమాంతరంగా నిర్మించారు. “మాయాబజార్”
తెలుగు చిత్రం 27-03-1957 న విడుదల కాగా, “మాయాబజార్” తమిళ చిత్రం 12-04-1957 న విడుదల అయ్యింది. అంతేకాకుండా “మాయాబజార్”(తెలుగు) సినిమాను 1965 లో కన్నడం లోకి డబ్బింగ్ చేసి విడుదల చేయగా అక్కడ కూడా విజయం సాధించింది.

తమిళనాడు రాష్ట్రం లోని 30 కేంద్రాలలో 33 థియేటర్ల లో “మాయా బజార్” తమిళ చిత్రం 1957 ఏప్రిల్ 12 వ తేదీన విడుదలై విజయం సాధించింది.
తమిళ ప్రజలు కూడ శ్రీ కృష్ణుడు గా ఎన్.టి.ఆర్. గారికి బ్రహ్మరథం పట్టారు. ఆనాటి నుండి తెలుగు, తమిళ ప్రజలకు ఎన్.టి.ఆర్. గారు ఆరాధ్య దైవం అయ్యారు…

Related posts