telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దేవి శ్రీ ప్రసాద్ ‘బి ద రియల్ మాన్ ఛాలెంజ్’ ను ఎలాచేసాడంటే…

దర్శకుడు సుకుమార్ విసిరిన ‘బి ద రియల్ మాన్ ఛాలెంజ్’ ను స్వీకరించిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన వీడియో పోస్ట్ చేశారు. ఇంటిని శుభ్రపరిచి, తన తల్లి గారికి ఆమ్లెట్ వేసి, తండ్రి గారైన సత్యమూర్తి గారి ఫోటోలను తుడిచి ఈ ఛాలెంజ్ ను పూర్తి చేశారు దేవి. చివరిగా ‘రియల్ మాన్’ లను తయారు చేస్తున్న ప్రతి తల్లికీ ఈ వీడియో అంకితం అంటూ ముగించారు. దేవి శ్రీ ప్రసాద్ పాపులర్ ట్యూన్లు అయిన పౌర్ణమి, నాన్నకు ప్రేమతో లోని మ్యూజిక్ తో ఉన్న ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ‘బి ద రియల్ మాన్ ఛాలెంజ్’ ఛాలెంజ్ కు తన తరఫు నుండి అల్లు అర్జున్, కార్తీ, యశ్, హరీష్ శంకర్, మోహన్ లాల్ లను నామినేట్ చేశారు దేవి శ్రీ ప్రసాద్.

Related posts