telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఒక యాక్సిడెంట్ ముగ్గురి ప్రాణాలను కాపాడింది… ఈ వీడియో చూస్తే…!!

Accident

అరిజోనాలో రాత్రి సమయంలో 53 ఏవీఈ అండ్ ఇండియన్ స్కూలు క్రాసింగ్ వద్ద రెడ్ సిగ్నల్ పడింది. వాహనాలు ఆగి ఉన్నాయి. దీంతో ఆ వైపు నుంచి ఓ జంట తమ పిల్లాడితో కలిసి రోడ్డు దాటుతోంది. అదే సమయంలో సిగ్నల్‌ను బ్రేక్ చేసి వారివైపు వేగంగా దూసుకొచ్చిందో కారు. అంతే.. పెద్ద ప్రమాదం జరిగిందని అందరూ అనుకున్నారు. కానీ అదే సమయంలో మరోవైపు నుంచి అంతే వేగంతో దూసుకొచ్చిన కారు రెప్పపాటులో ఆ కారును ఢీకొట్టింది. దీంతో మొదటి కారు మరోవైపునకు దూసుకెళ్లగా, ఢీకొట్టిన కారు అక్కడే గిర్రున తిరిగి ఆగిపోయింది. రెప్పమూసి తెరిచేంతలో పెను ప్రమాదం తప్పడంతో ఆ దృశ్యాన్ని చూస్తున్నవారు ఆశ్చర్యపోయారు. ఇక కార్లు ఢీకొన్న ఘటనలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. సిగ్నల్ క్రాస్ చేసి ముగ్గురి ప్రాణాలను బలితీసుకోబోయిన డ్రైవర్ తాగిన మత్తులో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురి ప్రాణాలు కాపాడినది చెవీ క్రూజ్ మోడల్ కారు. ఈ వీడియోను పోస్టు చేసిన పోలీసులు చెవీ క్రూజ్ రూపంలో వచ్చిన ఓ దేవదూత ఆ ముగ్గురి ప్రాణాలను కాపాడి ఉండొచ్చని క్యాప్షన్ తగిలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Related posts