telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చంద్రబాబుపై ఏదో అవహించినట్లుంది : పెద్దిరెడ్డి

Peddireddy

ఏపీ పంచాయతీ ఎన్నికలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మొదటి విడతలో 80 శాతానికి పైగా వైఎస్సార్సీపీ గెలిచిందని.. ఈ ఫలితాలు చూశాక చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నాడని పెద్దిరెడ్డి ఫైర్‌ అయ్యారు. చంద్రబాబుకు జగన్ అంటే ఫోబియా ఉందని ఆయన తెలిపారు. తప్పులు చేసిన వారు అనుభవించక తప్పదు అంటున్నాడు..ఆది చంద్రబాబుకే వర్తిస్తుందన్నారు. తన మేనిఫెస్టోలో ఏదీ అమలు చేయకనే కేవలం 23 సీట్లకు పరిమితం అయ్యాడని ఎద్దేవా చేశారు. జగన్ ఛరిష్మా ముందు చంద్రబాబు నిలువలేక ఏదో ఆవహించినట్లు చంద్రబాబు మాట్లాడుతున్నాడని… సజావుగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి..ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని తెలిపారు. తనకు చంద్రబాబు పోటుగాడు అనే బిరుదు ఇచ్చాడని…తీసుకుంటా కానీ చంద్రబాబు లాంటి వెన్నుపోటు దారుణ్ణి మాత్రం కాదని స్పష్టం చేశారు. పోస్కో అంతర్జాతీయ సంస్థ… ముఖ్యమంత్రికి సంబంధం ఏమిటి? వాళ్ళు సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారని పెద్దిరెడ్డి తెలిపారు. ఆ రోజు విశాఖ ఉక్కు ఉద్యమాన్ని లీడ్ చేసిన వ్యక్తి వెంకయ్యనాయుడని.. ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలన్నారు. విశాఖ ఉక్కుకు, జగన్ కి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు సెంట్రల్ ఫోర్స్ కావాలి అంటాడు..వీలుంటే విదేశాల నుంచి కూడా ఫోర్స్ కావాలి అంటాడని ఎద్దేవా చేశారు. ఆయన సీఎంగా ఉన్నపుడు కేంద్రబలగాలను ఎందుకు కోరలేదని ప్రశ్నించారు.

Related posts