telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేబినెట్ సబ్ కమిటీలో డీఎస్సీ-98 అంశాన్ని పెట్టే బాధ్యత నాదే -1998 డీఎస్సీ సాధన సమితికి విద్యా శాఖ మంత్రి సబిత భరోసా.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని (జూన్ 2) పురస్కరించుకుని డీఎస్సీ-1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు అందరికీ ఉద్యోగాలిచ్చి న్యాయం చేయించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి ఆదుకోవాలని 1998 డీఎస్సీ సాధన సమితి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని కోరింది.

సోమవారం పంజాగుట్ట శ్రీనగర్ కాలనీలోని నివాసంలో 1998 డీఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంత్రి సబితను కలిసి వినతిపత్రం అందజేసింది.

మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి తో కూడిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం త్వరితగతిన ఏర్పాటు చేయించి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి తమ సమస్యను త్వరలోనే పరిష్కరించాలని అభ్యర్థించారు.
స్పందించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ త్వరలో జరుగనున్న కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డీఎస్సీ-98 అంశం పెట్టించి న్యాయం చేయించే బాధ్యత తనదేనని సాధన సమితి నాయకులకు ఆమె భరోసా ఇచ్చారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని కలిసిన వారిలో 1998 డీఎస్సీ సాధన సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ గంటా శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శులు ఎస్.యాదగిరి రెడ్డి, గోపు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖాసీం, ఆడెపు రవీందర్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు నర్సయ్య, చెవ్వా సంపత్ కుమార్, బూర రాములు, ఆదూరి ప్రతాపరెడ్డి తదితరులు ఉన్నారు.

Related posts