telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ : .. మూడో టెస్టులోనూ రాణించిన .. రోహిత్ శర్మ..

rohit sharma records in 3rd test on south africa

టెస్ట్ సిరీస్ లో రోహిత్ శర్మ.. అన్న అందరి అంచనాలను తారుమారు చేస్తూ దూసుకుపోతున్నాడు. మొదటి సారి ఈసిరిస్ ద్వారా రోహిత్ టెస్టుల్లో ఓపెనర్ గా రానుండడమే అందుకు కారణం. ఈ సిరీస్ కు ముందు రోహిత్ ఫామ్ చూసి ఓపెనర్ గా ఈ టెస్ట్ సిరీస్ లో అతను సక్సెస్ కాడని విమర్శకులు తేల్చేశారు. కానీ ఈ సిరీస్ లో మొదటి టెస్ట్ లోనే రెండు ఇన్నింగ్స్ ల్లో రెండు సెంచరీలు చేసి విమర్శకుల నోర్లు మూయించాడు రోహిత్ శర్మ. ఆతరువాతి మ్యాచ్ లో ఓకే ఇన్నింగ్స్ లో అవకాశం రాగ దాంట్లో విఫలమయ్యాడు. ఈరోజు రాంచిలో మూడో టెస్ట్ ప్రారంభంగా రోహిత్ సెంచరీ తో చెలరేగి టెస్ట్ జట్టుకు తాను అర్హుడని నిరూపించుకున్నాడు. ఈక్రమంలో రోహిత్ పలు రికార్డులు సృష్టించాడు. ఈమ్యాచ్ ద్వారా రోహిత్ ఒకే సిరీస్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు విండీస్ ఆటగాడు హెట్మేయర్ ఒకే సిరీస్ లో 15 సిక్సర్లు కొట్టగా తాజాగా 17 సిక్సర్ల తో రోహిత్ ఆ రికార్డు ను బ్రేక్ చేశాడు.

ఒక సిరీస్‌లో భారత్‌ తరుఫున అత్యధిక సెంచరీలు సాధించిన ఓపెనర్ల జాబితాలో సునీల్‌ గవాస్కర్‌ తర్వాత ఎక్కువ శతకాలు సాధించిన ఆటగాడిగా రోహిత్ ఘనత సాధించాడు. గవాస్కర్‌ తన కెరీర్‌లో ఒక సిరీస్‌లో మూడు అంతకంటే సెంచరీలను మూడు సందర్భాల్లో సాధించాడు. ఆ తర్వాత ఇంతకాలానికి సౌతాఫ్రికా తో టెస్ట్ సిరీస్ రూపంలో ఒకే సిరీస్ లో మూడు సెంచరీలతో రోహిత్‌ శర్మ ఈ జాబితాలో చేరిపోయాడు. ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్లో 17 సిక్సర్ల తో.. అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈజాబితాలో బెన్ స్టోక్స్ 13, మయాంక్ అగర్వాల్ 8 జడేజా 7సిక్సర్ల తో తర్వాతి స్థానాల్లో వున్నారు.

Related posts