telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

తెలుగు సంగీత దర్శకుడు కోటికి అరుదైన గౌరవం భారతదేశానికి అంకితం ఇచ్చిన స్వర సామ్రాట్

తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారి ఒక సంగీత దర్శకుడికి ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. అది మరెవరికో కాదు, మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు పాటల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన కోటి. మన అభిమాన హీరోల సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించి, మన పెదవుల్లో పాటలా, మన గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సాలూరి రాజేశ్వరరావు గారి అబ్బాయి కోటిగా మన అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సాలూరి కోటేశ్వర రావు ఈ అవార్డు అందుకున్నారు.

ఇది తెలుగు సినిమా పాటకి జరిగే పట్టాభిషేకం, ఆ పాటకి ప్రాణం పోసిన సంగీతానికి కలిగే అరుదైన అవకాశం అని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్లో జరిగిన సెలబ్రేషన్ ఆఫ్ మ్యూజిక్ లో మన మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు తెలుగు సినిమా సంగీతానికి చేసిన సేవను గుర్తించి జీవిత సాఫల్య పురస్కారాన్ని Hon. జూలియా ఫిన్(M.P) మెంబర్ అఫ్ న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ అందించింది. అది స్వీకరించి కోటిగారు ప్రసంగిస్తూ, ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులకు మరియు ఐక్యరాజ్యసమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు, అంతే కాదు అక్కడున్న ప్రతి భారతీయుడి రోమాలు నిక్కపొడుచుకునేలా జై హింద్ అని ముగించే ముందు తన పురస్కారాన్ని భారతదేశానికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. తనకు ఇన్నిచ్చిన దేశానికి తన పురస్కారాన్ని అంకితమివ్వడంతో జాతి పట్ల తనకున్న కృతజ్ఞతను గౌరవాన్ని బాధ్యతను చాటుకున్నారు. అందుకే ఆయన స్వర సామ్రాట్
“సాలూరి” కోటేశ్వరరావు.

Related posts