telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

అధికారుల బదిలీలో కీలక మలుపు…

Nimmagadda ramesh

ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మొత్తం పంచాయతీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి.  ఎన్నికల కమిషన్ ఇటీవలే కొందరు అధికారులపై వేటు వేసింది. ఎస్ఈసి లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను కొన్ని రోజులక్రితం వేటు వేసింది.  ఆ తరువాత పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శి ద్వివేది, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గిరిజా శంకర్ లపై ఎస్ఈసి అభిశంసన ఉత్తర్వులను ఇచ్చింది.  అయితే, ఎస్ఈసికి ఆ అధికారాలు లేవని ప్రభుత్వం పేర్కొంటూ   అభిశంసన లేఖను తిరిగి ఎస్ఈసికి పంపింది.  కాగా, ఇప్పుడు మరోసారి ఇదే అంశంపై ప్రభుత్వం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.  ఈనెల 25 వ తేదీన సీఎస్ కు రెండుసార్లు లేఖలు రాశారని , ద్వివేది, గిరిజాశంకర్ లను బదిలీ చేయాలనీ  కోరుతూ లేఖలు రాసారని ప్రభుత్వం చెప్తున్నది.  వాటికి సంబంధించిన ప్రతుల్ని బయటపెట్టింది.  నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసి పోస్టును అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, నిమ్మగడ్డను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts