telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

చెన్నై నడిగర్ సంఘంలో అగ్నిప్రమాదం… కీలక పత్రాలు దగ్ధం

fire in plastic factory dhaka 13 died

దక్షిణ సినీ పరిశ్రమలోని వారి యూనియన్‌గా నడిగర్ సంఘం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ సంఘం ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు ఆఫీసు మొత్తం దగ్డం అయిపోయింది. వెంటనే వచ్చిన ఫైర్ సిబ్బంది మంటల ఆర్పేందకు అనేక విధాల ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆఫీసులోని ముఖ్యమైన ఫైళ్లు ఎన్నో దగ్ధం అయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో నడిగర్ సంఘానికి చెందిన నిధులు ఎంత వచ్చాయి. ఎంత ఖర్చయ్యాయి, ఇంకెంత ఉన్నాయి అనే సమాచారం ఉన్న ఫైళ్లతోపాటు, నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన సమయంలో కార్యక్రమాలను నిర్వహించి ఎంత నగదును సేకరించింది అనే వివరాలు ఉన్న పత్రాలు కూడా ఆఫీసులోనే ఉంటాయని అంటున్నారు. మంటలు ఎందుకు రగిలాయి, దానికి కారణం ఏంటి, ఎవరైనా కావాలనే చేశారా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే విచారణ చేపట్టిన పోలీసులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మరి వీరి విచారణలో ఏం తేలుతుందో చూడాలి.

 

Related posts