హీరో రానా దగ్గుబాటి తనకు కాబోయే భార్య మిహీకా బజాజ్‌ను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. తాజాగా మంచు లక్ష్మితో కలిసి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఆయన తన ప్రేమ వ్యవహారం గురించి కొన్ని విషయాలు చెప్పారు. తన పెద్ద చెల్లెలు ఆశ్రితకు మిహీకా క్లాస్‌మేట్ అని చెప్పారు. అందువల్ల మిహీకా తనకు చాలా కాలంగా తెలుసని.. అయితే, తామిద్దరి మధ్య ప్రేమ మాత్రం లాక్‌డౌన్‌కు కొన్ని రోజుల ముందు పుట్టిందని అన్నారు. తన ప్రేమను మిహీకా అంగీకరించడంతో పెద్దలకు చెప్పి ఒప్పించి పెళ్లి వరకు తీసుకెళ్లామని వెల్లడించారు. మిహీకా తన ఫ్యామిలీకి పరిచయం ఉన్న అమ్మాయేనని అన్నారు. అంతేకాకుండా, మిహీకాకు ముంబైలో ఉన్న ఫ్రెండ్స్ కూడా తనకు స్నేహితులు కావడం కూడా తామిద్దరి మధ్య బంధం ఏర్పడటానికి కారణమైందని తెలిపారు. మిహీకా నార్త్ ఇండియన్ అయినప్పటికీ హైదరాబాద్‌లోనే పెరిగిందని.. జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటుందని రానా చెప్పారు. మిహీకాకు తెలుగు కొంచెం కొంచెం వచ్చని.. తన కుటుంబ సభ్యులతో ఆమె తెలుగులో బాగానే మాట్లాడుతుందని రానా అన్నారు. తన ప్రేమ విషయం తల్లి లక్ష్మికి చెప్పగానే ఆమె ముఖంలో షాక్‌తో కూడిన హ్యాపీనెస్ కనిపించందని రానా అన్నారు. తాజాగా జరిగింది రోకా వేడుక అని.. త్వరలోనే ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకుంటామని తెలిపారు.
సుశాంత్ సోదరిపై రియా చక్రవర్తి సంచలన ఆరోపణలు