telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కత్రినా కైఫ్ కు జిరాక్స్ లా మరో బ్యూటీ…!?

Kathrina

మనుషులను పోలిని మనుషులు ఏడుగురు ఉంటారంటారనే సామెత ఉండనే ఉంది. ఇప్పటికే కొందరు సెలెబ్రిటీలను పోలిన వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌ను పోలిన మరో అమ్మాయి గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే కత్రినా పోలికలతో నటి జరీన్ ఖాన్ వెండి తెరకు పరిచయం అయ్యింది. కత్రినాతో గొడవ కారణంగా అప్పట్లో సల్మాన్ ఖాన్… తన “వీర్” సినిమా కోసం కత్రినా పోలికలు ఉన్న జరీన్ ఖాన్ వెతికి మరి పట్టుకొచ్చాడు. తాజాగా జరీన్ ఖాన్ కాకుండా అచ్చు కత్రినా పోలికలతో ఉన్న ఒకామె సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. జరీన్ ఖాన్ అన్న కత్రినాకు చాలా పోలికల్లో తేడా ఉన్నాయి. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం అచ్చుగుద్దినట్టు కత్రినాలా ఉంది. తాజాగా హీరోయిన్ కత్రినా కైఫ్‌ను పోలిన ఈ యువతి టిక్‌టాక్‌లో సందడి చేస్తోంది. కత్రినాకు జిరాక్స్ కాపీలా ఉన్న ఈమెపేరు ఎలిన్ రాయ్. ఈమె టిక్‌టాక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోలను వీడియోలను షేర్ చూస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కత్రీనా ట్రెండింగ్ స్టయిల్ ఫాలో చేస్తూ ఎలిన్ రాయ్ పలు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫోటోలు, వీడియోలు హల్చల్ చేస్తున్నాయి.

Related posts