telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైతు చేసిన సాయంపై కవిత ప్రశంసలు!

kavitha trs

తెలంగాణలో  లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలు తినడానికి తిండి లేకుండా బాధపడుతున్నారని తెలుసుకుని వారికి ఆదిలాబాద్‌ జిల్లా లాండసాంగ్వి రైతు మోర హన్మాండ్లు అనే రైతు సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌ నాయకురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ రైతు నిజమైన హీరో అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. 

 

 

  లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు తినడానికి తిండి దొరకడం లేదనే విషయం తెలిసింది. నాకున్న నాలుగెకరాల పొలంలో ఈ ఏడాది పంట కూడా బాగానే పండింది. ఇటీవలే పంట డబ్బులు వచ్చాయి. వారికి సాయం చేద్దామని నా కుమారులు తెలిపారు. దీంతో రూ.50 వేలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’ అని రైతు మోర హన్మాండ్లు తెలిపారు.  ఈ రైతు పై కవిత ఓ వార్తను పోస్ట్ చేశారు.

 

Related posts