telugu navyamedia
వార్తలు సామాజిక

సుప్రీం నుంచి పిటిషన్ ను వెనక్కి తీసుకున్న టిక్ టాక్!

tik tok app

సోషల్ మీడియా రంగంలో టిక్ టాక్ యాప్ ప్రత్యేక అంతా ఇంతా కాదు. ప్రతి పదిమందిలో ఒకర్ ఈ యాప్ ను వినియోగించడం విశేషం. అయితే, ఈ యాప్ కారణంగా అశ్లీల, అసభ్యకరమైన దృశ్యాల వల్ల చిన్నారుల పై దుష్పరిణామాలు చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే టిక్ టాక్ యాప్ ను నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ విచారణ జరిపి నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ టిక్ టాక్ సంస్థ అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ దీనిపై విచారణ జరుపుతూ, ఈ కేసును మద్రాస్ హైకోర్టు పరిష్కరిస్తుందని తెలిపారు. బదిలీ చేసిన కేసును తాము స్వీకరించలేమని స్పష్టం చేశారు. దాంతో తమ పిటిషన్ ను  వెనక్కి తీసుకుంటున్నట్టు టిక్ టాక్ వర్గాలు వెల్లడించినట్టు  సమాచారం. 

Related posts