telugu navyamedia
రాజకీయ వార్తలు

కేంద్రం నిర్ణయాలతో చిరువ్యాపారులకు లాభదాయకం: పవన్

pawan

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చిరు వ్యాపారాలకు ఎంతో లాభదాయకమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివరించారు. కరోనా మధ్యతరగతి ప్రజలపైనా, వేతన జీవులపైనా విపరీతమైన ప్రభావం చూపిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మధ్యతరగతికి ఆర్థిక భరోసా ఇచ్చేలా ఉన్నాయని పవన్ అభిప్రాయపడ్డారు. సొంత ఇంటి కోసం రుణాలు తీసుకునేవారికి వడ్డీ రాయితీని రూ.1.5 లక్షల మేర అదనంగా ఇస్తున్నారని తెలిపారు.

స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీలో రూ.50 వేల కోట్లు కేటాయించడం వల్ల మ్యూచువల్ ఫండ్స్ లో కొద్దిమొత్తాలు పెట్టుబడిగా పెట్టిన చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు నష్టపోకుండా ఉంటారని పవన్ తెలిపారు. అంతేగాకుండా, బోగస్ చిట్ ఫండ్ కంపెనీలను కట్టడి చేయడం వల్ల మధ్య తరగతి ప్రయోజనాలను కాపాడగలుగుతున్నారని పేర్కొన్నారు.

Related posts