telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జనాభాలెక్కలకు కూడా.. యాప్ .. : అమిత్ షా

app for population census

మొబైల్ యాప్ ద్వారా 2021 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా జనాభా లెక్కలను చేపట్టనున్నామని అమిత్ షా చెప్పారు. జనగణన కమిషనర్ కార్యాలయ నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన అమిత్ షా ఆ తరువాత ఈ వ్యాఖ్యలు చేశారు. హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ” జనాభా లెక్కల సేకరణకు మొదటిసారి మొబైల్ యాప్ ఉపయోగించబోతున్నాం. మొబైల్ యాప్ ద్వారా జనగణన చేయటం వలన ఒకే కార్డులో అన్ని వివరాలను నిక్షిప్తం చేసేందుకు సాయపడుతుంది. 2021 జనాభా లెక్కలు సంక్షేమ పథకాలకు, అభివృధ్ధి ప్రణాళికలకు ప్రాతిపదికగా మారబోతున్నాయని అన్నారు. జనాభా లెక్కల సేకరణలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని అమిత్ షా కోరారు.

జనాభా లెక్కల సేకరణ దేశ పురోగతిలో కీలకమైన పాత్ర పోషిస్తుందని అమిత్ షా అన్నారు. ప్రభుత్వ పథకాల అమలు కొరకు జనాభా లెక్కల సేకరణ, వివరాలు ఎలా ఉపయోగకరమో అధికారులు తెలియజేయాలి ” అని అన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా కొన్ని సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని అన్నారు. అధికారుల గురించి అమిత్ షా మాట్లాడుతూ “జాతి నిర్మాణంలో అధికారులు భాగస్వాములు కావాలని కోరారు. అధికారులు జనాభా లెక్కలను నిజాయితీగా నిర్వహించాలని అమిత్ షా అన్నారు. గత ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయకపోవటం వలన సంక్షేమ పథకాల అమలులో సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. 16 భాషల్లో 12 వేల కోట్ల రూపాయల ఖర్చుతో జనగణన చేపట్టనున్నామని అమిత్ షా అన్నారు.

Related posts