telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ : నవంబర్ నుంచి షూటింగ్‌లో సీత

Alia

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ “‘రౌద్రం రణం రుధిరం”. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా… అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఈ నెల 22వ తేదీన విడుదల చేసిన భీమ్ టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోంది. అతి తక్కువ టైమ్‌లోనే మిలియన్ లైకులు సాధించిన ఇండియన్ సినిమాగా ఘనత సాధించింది. అయితే టీజర్ చివర్లో కొమరం భీమ్‌ను ముస్లిం గెటప్‌లో చూపించడంతో వివాదం చెలరేగింది. రాజమౌళి ఆదివాసీల మనోభావాలు దెబ్బతీశారని, సినిమా విడుదలను అడ్డుకుంటామని పలు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అయితే రాజమౌళి ఈ వివాదాలను పట్టించుకోకుండా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఫిక్షనల్‌ ఇందులో సీత పాత్రలో నటించనున్న అలియా భట్ త్వరలోనే యూనిట్‌తో జత కలవనున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. ఆమె నవంబర్ 2 నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

Related posts