లాక్‌డౌన్ తర్వాత నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. రాజస్థాన్‌లో అయితే.. సెంచరీ దాటాయి పెట్రోలు, డీజిల్ ధరలు. ఇతర రాష్ట్రాల్లోనూ సెంచరీకి చేరువలో ఉన్నాయి పెట్రోలు ధరలు. పక్క దేశాల్లో తక్కువ ఉన్నప్పటికీ మనదేశంలోనే విపరీతంగా పెరుగుతున్నాయి పెట్రోలు, డీజిల్ ధరలు. ఈ నేపథ్యంలో అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని సర్భానంద సోనోవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. అదనపు సెస్‌గా విధిస్తున్న రూ. 5 తొలగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం శుక్రవారం రాత్రి నుంచే అమల్లోకి రానుంది. దేశంలో ఇంధనం ధరలు పెరుగుతూ పోతున్న తరుణంలో సర్భానంద్ సర్కార్ తాజా నిర్ణయం తీసుకోవడం విశేషం. దీనికి తోడు మద్యంపై విధించిన 25 శాతం అదనపు సెస్ కూడా రద్దు చేయాలని నిర్ణయించింది. దీంతో మందుబాబులకు కూడా ఊరట లభించింది. కాగా.. కరోనా నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, మద్యంపై అదనపు సెస్ విధించిన సంగతి తెలిసిందే.
previous post