ఏపీ లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి… తొలి విడత ఎన్నికలు ముగియడంతో.. రెండో విడతకు సిద్ధమవుతోంది ఎస్‌ఈసీ.. అయితే, పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే.. మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ తీరును నిరసిస్తూ.. ఎస్ఈసీ నిమ్మగడ్డను టిడిపి నేతలు కలిశారు. ఈ సందర్భంగా టిడిపి నేత బోండా ఉమ మాట్లాడారు. అధికార వైసీపీకి రాజ్యాంగం, వ్యవస్థలపై గౌరవం లేదని… వైసీపీ నేతలు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిమ్మగడ్డ వస్తే ఏం పీకుతాడని… మంత్రి కొడాలి నాని అనడం దారుణమన్నారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఎప్పుడూ తాగే ఉంటారని… వైసీపీకి ఓటేయకపోతే.. పథకాలు రాకుండా చేస్తామని జోగి రమేష్ అంటున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల వ్యవహారం గవర్నర్ దృష్టిలో ఉందని…ఏపీలో పంచాయతీ ఎన్నికల అక్రమాలపై రాష్ట్రపతి, కేంద్రం హోం మంత్రి, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్లామని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో 90 శాతం వైసీపీ గెలవాలని సీఎం టార్గెట్ పెట్టారని..దీనితో వైసీపీ నేతలు అధికార యంత్రాంగాన్ని బెదిరిస్తున్నారని తెలిపారు. విజయవాడలో పోలీస్ వ్యవస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదని.. వైసీపీ నేతలు ఆదేశాల్ని పోలీసులు పాటిస్తూ.. టిడిపి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా అభ్యర్థులపై బైండోవర్ కేసులు పెడుతున్నారని.. వైసీపీ ప్రభుత్వం ఉండేది కొద్ది రోజులేనని పేర్కొన్నారు. వైసీపీ నేతలు చెప్పారని అధికారులు చేస్తే.. వారికి ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.
previous post
నేను బతికిఉండగా పోలవరం పూర్తవుతుందనే నమ్మకం లేదు..