ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న క్రేజీ మూవీ “ఆర్ఆర్ఆర్” (రౌద్రం రణం రుధిరం). ఈ మూవీలో తానూ భాగం కానున్నానని ఇటీవలే శ్రియ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో అజయ్ దేవగన్ సరసన తాను కనిపించనున్నానని ప్రకటిస్తూ సీక్రెట్ రివీల్ చేసింది. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన శ్రియ.. తనతో నటించిన హీరోలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తను పని చేసిన హీరోల్లో కొంతమంది గురించి తన మనసులో మాటలను చెప్పి ఆకట్టుకుంది శ్రియ శరన్. పవన్ స్టార్ పవన్ కల్యాణ్ మంచి కోస్టార్ అని, ఆయనొక పుస్తకాల పురుగు అని చెప్పిన ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ గురించి స్పందిస్తూ… ఒకప్పుడు ఎన్టీఆర్ చాలా సైలెంట్‌గా ఉండేవాడని, ఇప్పుడు మాత్రం చాలా మారిపోయాడని చెప్పింది. అంతేకాదు ఎన్టీఆర్‌ను చూస్తుంటే ముచ్చటేస్తుందని చెప్పి ఆయన ఫ్యాన్స్‌ని హుషారెత్తించింది శ్రియ.
previous post
next post