telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో కొత్త రంగంలోకి అడుగుపెడుతున్న సమంత

Samantha

అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయం, విభిన్నమైన సినిమాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్ లో వెబ్ వరల్డ్ లో కూడా అడుగు పెట్టబోతోంది. సమంత సోషల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ కారణంగా లభించిన విరామ సమయాన్ని సమంత బాగా వినియోగించుకుంటోంది. యోగా, ధ్యానంతో పాటు తన ఇంటిపై వ్యవసాయం చేస్తూ తనకు కావాల్సిన ఆహారాన్ని తనే స్వయంగా పండించుకుంటోంది. కేవలం సినిమాల్లోనే గాక సామాజిక పరమైన అంశాల్లోనూ యాక్టివ్‌గా ఉంటూ ఇతర రంగాల్లోనూ రాణించేలా అడుగులేస్తోంది సమంత. త‌న ఫ్రెండ్స్, ఫ్యాష‌న్ డిజైన‌ర్ శిల్పారెడ్డి, ఎడ్యుకేష‌నిస్ట్ ముక్తా ఖురానాతో క‌లిసి ‘ఏక్కం’ అనే ప్రీ-స్కూళ్లను జూబ్లీ‌హిల్స్‌లో ప్రారంభించార‌ట స‌మంత‌. ఇప్పటికే ప్ర‌త్యూష అనే స్వ‌చ్చంద సంస్థ ద్వారా ఎంతోమంది చిన్నారుల‌కు సహాయం చేస్తుంది అక్కినేని వారి కోడలు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో ప్రారంభం కానున్న ఈ స్కూల్ లాక్‌డౌన్ రాకుంటే ఇప్పటికే స్టార్ట్ అయ్యేది. అయితే త్వరలోనే స్కూల్స్ ప్రారంభానికి అనుమతులు రాబోతున్నట్లు తెలుస్తుంది. ”తల్లిదండ్రులను శక్తివంతం చేస్తూ ఈ పరీక్షా సమయంలో పిల్లలకు సరైన విజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా మా ఈ కొత్త ప్రయత్నం” అంటూ సమంత ట్వీట్ చేసింది.

Related posts