telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

క్రికెట్ ప్రపంచం లో ఈ రోజు.. ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు ..

special day to cricket today

భారత మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే అంతర్జాతీయ టెస్ట్‌ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన బౌలర్‌; ఈ ఘనత 1999లో పాక్ పై సాధించాడు. అయితే తొలిసారి ఈ ఘనత అందుకున్నది మాత్రం ఇంగ్లండ్‌ మాజీ బౌలర్‌ జిమ్‌లేకర్‌. సరిగ్గా ఇదే రోజు(జూలై 31) 1956లో జిమ్‌ లేకర్‌ ఈ రికార్డును నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు. ఈ విషయాన్నే గుర్తు చేస్తూ ఐసీసీ ట్వీట్‌ చేసింది.

జిమ్‌లేకర్‌లా ఈ ఘనతను అందుకున్న బౌలర్‌ ఎవరైనా గుర్తుకువస్తున్నారా? అని ప్రశ్నించింది. అభిమానులందరూ జంబో పేరు కామెంట్‌ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరి తర్వాత అంతర్జాతీయ టెస్టుల్లో ఇప్పటి వరకు ఎవరూ ఈ ఘనతను అందుకోలేదు. డొమెస్టిక్‌ క్రికెట్‌లో మాత్రం రెక్స్‌ రాజ్‌సింగ్‌(మణిపూర్‌), దే దే దేబాషిష్‌ మొహాంతీలు ఈ ఫీట్‌ను అందుకున్నారు. ఇక జిమ్‌ లేకర్‌ 1946 నుంచి 1959లో ఇంగ్లండ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 46 మ్యాచ్‌లు ఆడిన జిమ్‌ 193 వికెట్లు పడగొట్టాడు.

Related posts